తొలి ముద్దు టైగర్ ష్రాఫ్‌తోనే.. అతనే బెస్ట్ కిస్సర్ : అనన్యా పాండే

0
44

ప్రస్తుతం సినిమాల్లో ముద్దు సీన్లు సర్వసాధారణం. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని సినిమా ఇండస్ట్రీల్లో నటినటులు చుంబన సన్నివేశాలకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని ఈ దృశ్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు దర్శకనిర్మాతలు.

ఇటీవలి కాలంలో తెలుగులోనూ బూతు డోష్ కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇక బాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ సినిమాల్లో ఆ సీన్స్ కామనైపోయాయి. ఇప్పటికే బాలీవుడ్ బెస్ట్ కిస్సర్ ఎవరని అడిగితే టక్కున గుర్తొచ్చేది ఇమ్రాన్ హాష్మి. మొదటి నుంచి దాదాపు తను నటించిన ప్రతీ సినిమాలో లిప్ లాక్ సీన్స్ చేశాడు.

అయితే, తాజాగా బెస్ట్ కిస్సర్ ఎవరనే విషయంపై ఓ రేడియో కార్యక్రమంలో పాల్గొన్న హీరో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదర చుంబనంలో తనను తానే బెస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. టైగర్ తాను నటించిన మొదటి చిత్రం నుండి దాదాపు ప్రతీ సినిమాలో లిప్ లాక్ సీన్స్ చేశాడు. అందుకే తనను తాను బెస్ట్ కిస్సర్ అని కితాబు ఇచ్చుకున్నాడు.

ఇక అదే రేడియో షోలో పాల్గొన్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ మూవీ హీరోయిన్లు అనన్య పాండే, తారా సుతారియాలు మాట్లాడుతూ నిజంగానే టైగర్ బెస్ట్ కిస్సర్ అని తెలిపారు. దీనిపై స్పందించిన అనన్య పాండే తన తొలి ముద్దు టైగర్ ష్రాఫ్‌తోనే కనుక తనకు బెస్ట్ కిస్సర్‌గా అతడే తెలుసంటూ చెప్పింది. మొదటి మూవీనే అయినప్పటికీ అందాల ప్రదర్శనలో ఏమాత్రం మొహమాట పడలేదని ప్రచార చిత్రాల ద్వారా అర్థమవుతోంది.