నాగార్జున ‘మన్మథుడు-2’లో కీర్తి సురేష్

0
47

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం “మన్మథుడు-2”. ఈ చిత్రం ‘మన్మథుడు’కు సీక్వెల్. పైగా, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తర్వాత నాగార్జున నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా హిట్ కాలేదు. దీంతో ఈ ‘మన్మథుడు-2’ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు. పైగా, ఈ చిత్రాన్ని ఆయన తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు.

ఆ మధ్య రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రంతో పాటు ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఇలా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న నాగ్… యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నటించేందుకు సై అన్నాడు.

పైగా, ఈ దర్శకుడు కూడా వరుస ఫ్లాప్‌లో కెరీర్ కొనసాగిస్తున్నాడు. అలాంటి దర్శకుడు చేతిలో ‘మన్మథుడు-2’ పెట్టటం కొంత ఫ్యాన్స్‌ను అయోమయంలోకి నెట్టింది. అయితే నాగార్జునకు, ముఖ్యంగా సమంతకు రాహుల్‌పై ఉన్న నమ్మకంతో షూటింగ్ మొదలైంది.

ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది. అక్షర గౌడ, సమంత స్పెషల్ అప్పీయరెన్సు ఇవ్వనున్నారు. ఇదే కోవలో మరో కీర్తి సురేష్ కూడా స్పెషల్ కేమియో రోల్ చేయనుంది అనే వార్తలు వస్తున్నాయి. గ్లామర్‌కు కొదువలేని ఈ సినిమా ఖచ్చితం‌గా హిట్ అవుతుంది అని ఇప్పటినుంచే పండుగ చేసుకుంటున్నారు అక్కినేని ఫాన్స్