భయంతో పరుగులు తీసిన నాని హీరోయిన్

0
43

బాలీవుడ్ హీరోయిన్ వాణీకపూర్‌ను ఓ అభిమాని వెంటాడు. దీంతో ఆమె భయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దాక్కొంది. తాజాగా వాణీ కపూర్ తన కారులో ప్రయాణిస్తున్నది. దీన్ని గమనించిన ఓ అభిమాని ఆ కారును వెంబడించాడు. ఆ తర్వాత ఆ అభిమాని చర్యలకు భయపడి పోలీసులను ఆశ్రయించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అసలేం జరిగిదంటే… ముంబైలో రాత్రివేళ వాణీకపూర్ తన కారులో వెళ్తున్న సమయంలో ఓ యువకుడు ఆమెని గమనించి వెంబడించడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన వాణీకపూర్ కారు డ్రైవర్2తో మరింత వేగంగా కారు నడపమని చెప్పింది. అయినప్పటికీ ఆ యువకుడు ఆమె కారును మాత్రం ఫాలో అవుతూనే ఉన్నాడు.

దాంతో డ్రైవర్ కారును నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాడు. అక్కడ వాణీ కపూర్ ఆ యువకుడిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసుల విచారణలో ఆ యువకుడి పేరు సమీర్ ఖాన్ అని తెలిసింది. అతడు వాణీకి అభిమాని పోలీసులు తెలిపారు. ఆమెను కలిసేందుకు అతడు అనుసరించినట్లు తెలుస్తోంది.

కాగా, మూడు పదుల వాణీ కపూర్… 2013లో వచ్చిన “శుద్ధ్ దేశీ రొమాన్స్” చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత రణవీర్ సింగ్‌తో ‘బేఫికరే’ సినిమాలో ఆడిపాడింది. తెలుగులో నాని హీరోగా వచ్చిన ‘ఆహా కళ్యాణం’ మూవీలో నటించింది. ప్రస్తుతం వాణీకపూర్ బాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.