రేప్ కేసులో కరణ్ ఒబెరాయ్ అరెస్టు

0
80

బాలీవుడ్ బుల్లితెర నటుడు కరణ్ ఒబెరియా‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై అత్యాచారంతో పాటు.. బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలతోపాటు ఫిర్యాదు కూడా రావడంతో ఆయన్ను అరెస్టు చేశారు.

ఈయన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియోలను బయటపెడతానని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు ముంబైలోని ఒషివర పోలీస్ స్టేషన్‌లో ఒబెరాయ్‌పై 376, 384 సెక్షన్ల కింద కేసు నమోదైంది. బాధితురాలిని పెళ్లి పేరుతో వంచించడంతో పాటు డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

‘ఏ బ్యాండ్ ఆఫ్ బాయ్స్ మెంబర్’ అయిన కరణ్… షాయా, జస్సి జైసి కోయి నహి, ఇన్సైడ్ ఏడ్జ్ వంటి టివి సిరీస్‌లలో నటించారు. అలాగే ఎఫ్ బిబి, రాయల్ ఏన్ఫీల్డ్ రైడింగ్ అప్పరెల్, అల్డొ, జాక్ అండ్ జోన్స్, లంబోర్ఘిని యాడ్‌లలో కూడా నటించారు.