న్యూయార్క్‌లోని ప్రఖ్యాత మెట్రోపాలిటన్ మ్యూజియంలో 71వ మెట్ గాలా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో హాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు వివిధ రకాలైన డ్రెస్‌లలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా లేడీ గాగ. రెడ్ రోజ్ కలర్ డ్రెస్‌లో అదరగొట్టింది.
ఇదిలావుంటే, ఈ వేడుకలో ప్రియాంక చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెట్ గాలా షోలో పింక్ కార్పెట్‌పై పింక్ డ్రెస్‌తో అదరగొట్టింది. లూజ్ హెయిర్, ఉల్లిపొరలాంటి డ్రెస్‌తో ఆకట్టుకుంది.
ప్రతి యేడాది మే మొదటి సోమవారం నిర్వహించే ఈ మెట్ గాలా కోసం ఫ్యాషన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఫ్యాషన్ ప్రపంచాన్ని ఎట్రాక్ట్ చేసే షోలో ప్రియాంక తన భర్త నిక్ జోనస్‌తో కలిసి పింక్ కార్పెట్‌పై క్యాట్ వాక్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి.