ప్రియాంకా చోప్రా సోదరుడి పెళ్లి ఎందుకు ఆగిపోయిందంటే…

0
57

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోదరుడు సిద్దార్థ్ చోప్రా వివాహం ఆగిపోయింది. కుటుంబసభ్యుల సమాచారం మేరకు ఏప్రిల్ చివరి వారంలో సిద్దార్థ్, ఇషితాకుమార్ పెళ్లికి నిశ్చయించారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ పెళ్లి రద్దు అయింది. అయితే సిద్ధార్థ్ పెళ్లి ఇంత హఠాత్తుగా ఎందుకు ఆగిపోయిందనే విషయం మాత్రం తెలియదు.

ఈ విషయమై తాజాగా సిద్ధార్థ్ తల్లి మధు చోప్రా వివరణ ఇచ్చారు. తాను ఇపుడే పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేనని, పెళ్లికి కొంత సమయం కావాలని సిద్ధార్థ్ కోరడంతో వివాహం రద్దు చేయాల్సి వచ్చిందని చెప్పారు.

అయితే పెళ్లికి సంబంధించిన తదుపరి వివరాలు చెప్పేందుకు మధు చోప్రా నిరాకరించారు. ఇషితకు ఆపరేషన్ జరగాల్సి ఉండటం వల్లే.. వీరి పెళ్లి రద్దందని ఇటీవలే వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా మధు చోప్రా వెల్లడించిన వివరాలతో.. సిద్ధార్థ రెడీగా లేకపోవడం వల్లే పెళ్లి ఆగిపోయినట్లు స్పష్టత వచ్చింది.