మన ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. అది కూడా వేసవి కాలంలో ఎండల్లో బయటకి వెళ్లెటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లెటప్పుడు ఆహారం తిని వెళ్లాలి. ఆహారంతో పాటు మజ్జిగ కూడా తీసుకుంటే మంచిది. మజ్జిగలో ఉన్న కాల్షియం కండరాలని బలహీనపడకుండా చేస్తాయి.
ఎండలో బయటకు వెళ్లెటప్పుడు సబ్జా గింజలు కలిపిన నిమ్మరసం, మజ్జిగ, నీళ్లు వెంట తీసుకుని వెళ్లడం చాలా మంచిది. ఈ పానీయాలు మధ్య మధ్యలో తాగడం వలన శరీరానికి కావలసినంత శక్తిని ఇస్తాయి. నిమ్మరసంలో ఉన్న పోటాషియం, సబ్జాగింజలు డీహైడేషన్ నుంచి కాపాడుతాయి.
ఇకపోతే, ఆహారం బయట తినవలసినప్పుడు స్టీమ్ చేసిన ఆహారం వంటివి ఆరగించాలి. ఆయిల్‌తో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మన ఆరోగ్యానికి కావలసిన జాగ్రత్తలు మనమే పాటించాలి.