నిషా అగర్వాల్… టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సొంత చెల్లి. నిషాను టాలీవుడ్‌కు పరిచయం చేసింది కూడా కాజల్ అగర్వాలే. పలు చిత్రాల్లో నటించింది. కానీ, వాటిలో ఓ ఒక్కటీ క్లిక్ కాలేదు. ఫలితంగా ఆమె టాలీవుడ్‌లో నిలదొక్కుకోలేక పోయింది.
మరోవైపు, వయసు మీదపడుతున్నా కాజల్ అగర్వాల్ మాత్రం ఇప్పటికీ దూసుకెళుతోంది. కథ నచ్చితే చాలు హీరోలు చిన్నాపెద్దా అనే తేడా చిత్రాలు అంగీకరిస్తోంది.
అయితే, తన చెల్లి విషయంలో ఆమె పూర్తిగా డిజప్పాయింట్‌మెంట్ అయింది. హ్యాపీగా పెళ్లి చేసుకొని కొడుకుని కని కాజల్‌ని పెద్దమ్మ కూడా చేసేసింది. ఇక లైఫ్‌లో సడన్‌గా మళ్ళీ అమ్మడు గ్లామర్ వరల్డ్ వైపుకు అడుగులు వేస్తోంది.
నిషా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొంతకాలంగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. అయితే అందులో భాగంగానే అమ్మడు ఇప్పుడు ఫిట్నెస్‌పై దృష్టిసారించింది. సోషల్ మీడియాలో రోజు ఎదో ఒక ఫోటోతో హల్చల్ చేస్తూనే ఉంది. మరి అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్‌ని ఏ విధంగా మొదలెడుతుందో చూడాలి