ఇపుడు ప్రతి ఒక్కరూ గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ఇంటిపట్టునే ఉంటూ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు. గుండె జబ్బుల బారి నుంచి కొంతమేరకు రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా, గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతిరోజూ భోజనంతో పాటు జామపండును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* జామపండు ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
* జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.
* బాగా మాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుంది.
* ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
* మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుంది.
* పచ్చి జామకాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి.
* జామకాయలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉండడంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం ఆగుతుంది.