సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్టే : రాజస్థాన్ హైకోర్టు

0
49

ఇటీవలి కాలంలో సహజీవనం చేయడం కామనైపోతోంది. ఆ తర్వాత విడిపోతున్నారు. అయితే, ఓ మహిళతో కొన్నాళ్లపాటు సహజీవనం చేస్తే అది పెళ్లితో సమానమని రాజస్థాన్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు ఓ మహిళతో సహజీవనం చేసి ఆ తర్వాత మరో యువతిని పెళ్లాడేందుకు ప్రయత్నించిన వ్యక్తికి హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది.

భారతీయ సమాజంలో సహజీవనం చేయడమంటే పెళ్లి చేసుకున్నట్టుగానే పరిగణించాలని అభిప్రాయపడింది. అంతేకానీ, మరోలా భావించడంలో అర్థం లేదని పేర్కొంది.

ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న వివాహితతో అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బలరాంకు స్నేహం కుదిరింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది. ఆమెను పెళ్లాడతానని బలరాం మాటివ్వడంతో ఉపాధ్యాయురాలు తన భర్త నుంచి వేరుపడి అతడి వద్దకు వచ్చేసింది.

అయితే, ఇటీవల బలరాంకు ఐటీలో మంచి ఉద్యోగం వచ్చింది. దీంతో అతడు మరో అమ్మాయిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన ఉపాధ్యాయురాలు హైకోర్టును ఆశ్రయించింది. సహజీవనం చేయడమంటే పెళ్లాడినట్టేనని సంచలన తీర్పు వెలువరించింది.