చాలా మందిని వెన్ను నొప్పి వేధిస్తూ ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూ వున్నా.. కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చునే వారికి వెన్నునొప్పి ఖాయం. ఇలాంటివారు ఇంట్లో ఉండే కొన్ని పాటి వస్తువులతో ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా, వెల్లుల్లి, ఆముదంతో వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
వెన్నునొప్పి తగ్గాలంటే ఆముదాన్ని వేడి చేసి రాయాలి. అలాగే వెల్లుల్లిపాయలను కొన్నింటిని తీసుకుని కొద్దిగా నువ్వుల నూనెల వేసి బాగా కాచాలి. అనంతరం గోరువెచ్చగా ఉన్న సమయంలో వెన్ను నొప్పి ఉన్న ప్రాంతంలో రాస్తే మంచి ఫలితం వుంటుంది.
ఇంకా వెన్నునొప్పి రాకుండా ఉండాలంటే.. కారు.. బైక్ నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కారు నడిపేటప్పుడు చిన్నపాటి దిండ్లను వాడటం బెటర్. వేడిగా ఉన్న నువ్వుల నూనెతో మసాజ్ చేయించుకుంటే నొప్పి తగ్గే అవకాశం ఉంది. మునగాకు రసం, పాలు సమపాళ్లుగా తీసుకుని సేవించడం ద్వారా వెన్నునొప్పిని దూరం చేసుకోవచ్చు.
వెన్నునొప్పి అధికంగా ఉన్న సమయంలో అధిక బరువులు ఎత్తడం, ఒకేసారి హఠాత్తుగా వంగటం వంటివి చేయకూడదు. శరీర బరువు అధికంగా ఉంటే వెంటనే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే వెన్ను నొప్పిని దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.