కుర్ర హీరోతో కులుకుతున్న మలైకా అరోరా

0
42

బాలీవుడ్ నటి మలైకా అరోరా. పెద్ద ముదురు హీరోయిన్. ఈమె ఓ కుర్ర హీరోతో కులుకుతోంది. గత కొంతకాలంగా యంగ్ హీరో అర్జున్ క‌పూర్‌ను లైన్లో పెట్టి తన వెంట తిప్పుకుంటోంది. పైగా, వీరిద్ద‌రూ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌నే వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ వార్త‌ల‌పై అర్జున్ క‌పూర్ స్పందించాడు. తాను పెళ్లి చేసుకుంటున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను అర్జున్ కొట్టిపారేశాడు. ‘నేను పెళ్లి చేసుకోవ‌డం లేదు. ఒక‌వేళ నేను పెళ్లి చేసుకుంటున్న‌ట్లైతే ఆ విష‌యం అంద‌రికి చెప్తాను. నాకు పెళ్లి విష‌యం దాచేంత పెద్ద కార‌ణాలేవి లేవు. నేను ప్ర‌స్తుతం ప‌నిచేసుకుంటున్నా. పెళ్లి చేసుకునేవాళ్ల జాబితాలో నేను లేను.

నా పెళ్లి గురించి జ‌నాలు మాట్లాడుకుంటున్న మాట‌ల‌ను ప‌ట్టించుకోను. జ‌నాలు నా వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఎంత‌గా ప‌రిశీలిస్తున్నారో తెలుస్తోంది. అయినా నాకెలాంటి ఇబ్బంది లేదు. ఇలాంటి వార్త‌లు ప్రొఫెష‌న్‌లో భాగమే. అయితే ఇలాంటి వార్త‌లు రాస్తున్న‌పుడు మీడియా కూడా కాస్త బాధ్య‌తగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌ర‌ముంటుంద‌ని’ సూచించాడు