ఒక్క వేసవి కాలంలోనే కాకుండా అన్ని కాలాల్లో పెరుగును ఆరగించవచ్చు. ఇది శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహార పదార్థాల్లో ఒకటి. పెరుగును వేసవిలో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖ్యంగా శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ క్రమంలోనే పెరుగును ఈ సీజన్‌లో రోజూ తింటే మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* పెరుగును రోజూ తినడం వల్ల జీర్ణ సమస్యలు దరిచేరవు. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి మాయమైపోతాయి. కడుపులో అసిడీ కారణంగా మంట ఉంటే తగ్గిపోతుంది.
* అధిక బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో పెరుగును భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పెరుగు తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
* కేన్సర్లను అడ్డుకునే శక్తి పెరుగులోని ఔషధ గుణాలకు ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పెరుగును రోజూ తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.