అనసూయ షర్ట్ మాత్రమే వేసుకుని భర్తకు మసాజ్ చేస్తావా?

0
40
Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన యాంకర్ అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. కీలక పాత్రలు పోషిస్తోంది. ఈ క్రమంలో రంగమ్మత్తగా రంగస్థలం ద్వారా హిట్ కొట్టింది. ప్రస్తుతం చేతి నిండా సినిమా ఆఫర్లతో అనసూయ బిజీ బిజీగా వుంది.

అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే అనసూయ తాజాగా ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఈ పోస్టుపై ఆమెపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తన భర్త శశాంక్ భరద్వాజ్ కు అనసూయ మసాజ్ చేస్తున్న సందర్భంలో వారి కొడుకు అయాన్ష్ ఓ ఫొటో తీశాడు. ఈ ఫొటోను అనసూయ తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేసింది.

భర్తకు మసాజ్ చేస్తున్న అనసూయ కేవలం షర్ట్ మాత్రమే ధరించి ఉన్నట్టు ఆ ఫొటోలో కనపడుతుంది. దీనిపై, నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేసే ముందు ఆలోచించండి అంటూ ఆమెకు హితవు పలికారు.