‘ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం’ చిత్రం తర్వాత సమంత, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం ‘మజిలీ’. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. సక్సెస్‌ని ఎంజాయ్ చేసేందుకు సమంత, చై హాలీడ్ ట్రిప్‌గా స్పెయిన్‌కి వెళ్ళారు.
బార్సిలోనాలోని ప్రముఖ చెఫ్ డానీ గార్సియాకు చెందిన రెస్టారెంట్ ముందు వీరిరివురు కలిసి ఫోటోకి ఫోజులిచ్చారు. ఆ ఫోటోని చైతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వాళ్లు అక్కడ లంచ్ చేసిన ఫొటోలు ఇటీవల చక్కర్లు కొట్టాయి.
తాజాగా స్విమ్మింగ్ పూల్ పక్కన నవ్వుతున్న సమంత, నాగచైతన్య ఫొటో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. పడక కుర్చీలో చైతూ, సమంత పొట్టి బట్టలు కూర్చొని సేద తీరుతున్నట్టుగా ఫోటోలో కనిపిస్తూ ఉంది. ఆ ఫొటో మీద ‘ఐలవ్యూ 3000’ అని రాసి ఉంది. దీనికి అర్థం ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ చూసిన వాళ్లకు వెంటనే తెలుస్తుంది.
ఆ చిత్రంలో ఐరన్‌మ్యాన్ కుమార్తె ఈ డైలాగు చెబుతుందన్నమాట. నచ్చిన సినిమాలను గురించి తక్షణమే సోషల్ మీడియాలో ప్రస్తావించే సమంత, తాజాగా ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ చూసినట్టు దీన్ని బట్టి అర్థమవుతోంది. ఆమె చేతిలో ‘ఓ బేబీ ఎంత సక్కగున్నావే’, ’96’ తెలుగు రీమేక్, ‘మన్మథుడు2’ సినిమాలున్నాయి. నాగచైతన్య ‘వెంకీమామ’తో బిజీగా ఉన్నారు.