మిస్టర్ మోడీ.. ఆరోపణలు తప్పైతే 100 గుంజీలు తీయాలి..

0
62

ప్రధాని నరేంద్ర మోడీపై పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ప్రధాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఇవాళ పశ్చిమబెంగాల్ లోని పురులియా, బంకురా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ తృణముల్ కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. టీఎంసీ నేతలు కోల్‌స్కాంకు పాల్పడుతున్నారని మోడీ ఆరోపించారు. అయితే మోడీ వ్యాఖ్యలను అదే స్థాయిలో తిప్పికొట్టారు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ.

కోల్ స్కాంలో టీఎంసీ అభ్యర్థులెవరైనా ఉన్నట్లు మోడీ రుజువు చేస్తే.. మొత్తం 42 స్థానాల్లో నుంచి పోటీ చేస్తున్న తమ పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎన్నికల నుంచి తప్పుకుంటారని మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ ఆరోపణలు తప్పని రుజువైతే.. మోడీ ప్రజల ఎదుట చెవులు పట్టుకుని 100 గుంజీలు తీయాలంటూ సవాలు విసిరారు.