ఐపీఎల్‌పై బెట్టింగ్ వద్దురా మగడా.. అన్నందుకు భార్య చేత యాసిడ్ తాగించాడు..

0
34
Suicide
Suicide

ఐపీఎల్ మ్యాచ్‌లపై పందేలు వద్దురా మగడా అన్నందుకు ఓ భర్త అకృత్యానికి పాల్పడ్డాడు. ఐపీఎల్‌లో బెట్టింగ్ వద్దన్న భార్యను కుటుంబ సభ్యులతో కలిసి దారుణంగా చంపేశాడో భర్త. పశ్చిమబెంగాల్‌లోని మాల్దా పట్టణంలో జరిగిందీ ఘటన. అధిక వడ్డీలకు అప్పు తీసుకుని ఐపీఎల్ మ్యాచ్‌లపై పందేలు కడుతూ వచ్చిన భర్తను భార్య హెచ్చరించింది. అయితే బెట్టింగ్‌లు వద్దన్న పాపానికి భార్య చేత ఆ దుర్మార్గపు భర్త యాసిడ్ తాగించాడు.

భర్త, ఆయన కుటుంబ సభ్యుల చేతిలో తీవ్రంగా గాయపడిన అర్పిత దాస్‌గుప్తా (32)ను వెంటనే మాల్దా మెడికల్ కాలేజీ ఆసుపత్రి (ఎంఎంసీహెచ్)కి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

అర్పిత తండ్రి సంతోష్ దత్తా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. అర్పిత‌- సువేందు దాస్‌గుప్తాలకు ఆరేళ్ల క్రితం వివాహమైందని అర్పిత తండ్రి తెలిపారు. ఐపీఎల్ బెట్టింగులకు అలవాటు పడిన భర్తను వారించడంతోనే తన కుమార్తెను హత్య చేసినట్టు ఆయన ఆరోపించారు.