గజనీ దర్శకుడు మోసం చేశారు : నయనతార

0
56

తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌పై హీరోయిన్ నయనతార మండిపడుతోంది. తాను తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత చెత్త నిర్ణయం ఆ చిత్రంలో నటించడం అని వాపోతోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి, ఆమె నటించిన చిత్రమేంటో ఆమె వెల్లడించింది.

సూర్య హీరోగా ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గజిని’. అప్పట్లో సూపర్ హిట్ చిత్రం. సూర్య కెరీర్‌ను మార్చేసింది కూడా. ఇందులో అసిన్‌, నయనతార హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయనతార ప్రస్తావించారు. ఈ చిత్రం తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు.

‘నా కెరీర్‌లో “గజిని” వల్ల చాలా నేర్చుకున్నా. మరీ ముఖ్యంగా అప్పటినుంచీ కథల్ని వినే తీరును మార్చుకున్నా. ఎవరైనా మల్టీస్టారర్’ అని అనగానే మరింత జాగ్రత్తగా కథను, నా పాత్రను తీర్చిదిద్దిన విధానాన్ని గమనించసాగా. నిజానికి రజనీకాంత్‌ ‘చంద్రముఖి’, విజయ్‌ ‘శివకాశి చిత్రాల్లో నటిద్దామా?వద్దా? అని అప్పట్లో చాలా సందిగ్ధంలో ఉన్నా. కానీ అవే నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి’ అని ఈ మలయాళ బ్యూటీ చెప్పుకొచ్చింది.