నవ్వించే పాత్రలు కావాలంటున్న మిల్కీబ్యూటీ

0
65
Tamanna Bhatia
Tamanna

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీబ్యూటీ, తెల్లపిల్లగా గుర్తింపు పొందిన హీరోయిన్ తమన్నా. ఈమె తాజాగా నిర్మాతలకు ఓ షరతు పెట్టినట్టు సమాచారం. ఇంతకీ ఆ షరతు ఏంటో పరిశీలిద్ధాం.

తనకు నవ్వించే క్యారక్టర్లంటే ఇష్టమనీ, ప్రేక్షకుల చేత ఏడిపించే సన్నివేశాలు తాను చేయలేనని తన దగ్గరకు వచ్చిన దర్శకనిర్మాతలకు తమన్నా గట్టిగా చెబుతోంది. నవ్వించే క్యారక్టర్లు ఉంటేనే తనను సంప్రదించమని కూడా అంటోందట!.

అంతా బాగానే ఉంది కానీ, ఇప్పటివరకు నటనలో మెళుకువలు నేర్చుకోని తమన్నా, ప్రేక్షకులతో అప్పుడప్పుడు కన్నీరు పెట్టిస్తూనే ఉందంటున్నారు. ఏదో గ్లామర్‌గా ఉంటుంది కనుక అవకాశాలొస్తున్నాయనీ, అది కూడా లేకపోతే, ఈపాటికి తట్టా బుట్టా సర్దేసుకుని వెళ్లిపోయేదని ఆమె అంటోంది.