నా పేరు అలియా అద్వానీ అంటున్న కియారా అద్వానీ

0
44

బాలీవుడ్ నటి కియారా అద్వానీ. ప్రస్తుతం ఈ అమ్మడు చుట్టూ దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. పైగా, కుర్రకారు కూడా ఈ అమ్మడు పేరునే కలవరిస్తున్నారు. యువతలో తనకి గల క్రేజ్ కారణంగానే బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో ఈ సుందరి దూసుకుపోతోంది.

‘కబీర్ సింగ్’ .. ‘గుడ్ న్యూస్’ .. ‘షేర్షా’ .. ‘లక్ష్మీ బాంబ్’ చిత్రాలతో ఆమె తన దూకుడు చూపిస్తోంది. గ్లామర్ పరంగా.. నటనపరంగా మంచి మార్కులు కొట్టేస్తోన్న కియారా అద్వానీ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ రహస్యాన్ని బయటపెట్టింది.

“నా అసలు పేరు కియారా అద్వాని కాదు .. అలియా అద్వానీ. ‘ఆల్రెడీ ఇండస్ట్రీలో అలియా భట్ వుంది. అందువలన ‘అలియా’తో మొదలయ్యే మరో పేరుతో ఇండస్ట్రీలో కొనసాగడం అంత కరెక్ట్ కాదు. నా మాట విని వెంటనే పేరు మార్చుకో” అని హీరో సల్మాన్ ఖాన్ సలహా ఇచ్చారని చెప్పింది.

ఆయన చెప్పింది నిజమేనని అనిపించడంతో నా పేరును ‘కియారా అద్వానీ’గా మార్చుకున్నాను. మా అమ్మానాన్న కూడా నన్ను ఇప్పుడు ఇదే పేరుతో పిలుస్తున్నారు” అని ఈ బాలీవుడ్ సుందరి చెపుతోంది.