నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు.. ఆఫీసులోనే వున్నా.. రవిప్రకాష్

0
43
TV9 CEO Ravi Prakash
TV9 CEO Ravi Prakash

టీవీ 9 యాజమాన్య మార్పిడి, వాటాల అమ్మకానికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే ఆ ఛానల్ సీఈవో రవి ప్రకాశ్, సినీ నటుడు శివాజీ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అలాగే టీవీ9 ఫైనాన్స్ డైరెక్టర్ మూర్తి ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. మూర్తికి టీవీ9 ఛానల్‌లో 1.5 శాతం వాటాలు వున్నట్టు చెబుతున్నారు.

ఈ కేసు విచారణలో భాగంగా టీవీ9 కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించిన పోలీసులు ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్టు తెలిపారు.

అలాగే శుక్రవారం విచారణకు హాజరు కావాలని రవి ప్రకాశ్, శివాజీతో పాటు మూర్తికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మీడియా సంస్థ ‘టీవీ 9’ సీఈవో పదవి నుంచి రవిప్రకాశ్ ను తొలగించారన్న వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవి ప్రకాశ్ స్పందించారు.

తాను, ‘టీవీ 9’ ఫౌండర్ చైర్మన్, సీఈఓ.. టీవీ 9 హెడ్ క్వార్టర్స్ బంజారాహిల్స్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఎన్సీఎల్టీ కేసు కోర్టులో ఉంది. 16వ తారీఖున ఆ కేసు విచారణకు రానుంది. ఆ వివాదాన్ని తీసుకుని కొంత మంది ఏవో తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేశారు. తప్పుడు కేసులు, అబద్ధాలు, అవాస్తవాలు నిలబడవు. ‘సత్యం’ మాత్రమే నిలబడుతుంది. రవిప్రకాశ్ రెండు రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం వాస్తవం కాదని చెప్పుకొచ్చారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని.. క్లారిటీ ఇచ్చారు.