ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోడీని ఓ పిరికి ప్రధానిగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రత్నసింగ్‌కు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, మోడీ వంటి భయస్థుడు, బలహీనమైన ప్రధానిని తాను ఎన్నడూ చూడలేదన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మోడీ మరిచారని దుయ్యబట్టారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగార్చిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఈ పథకం కింద ప్రస్తుతం ఉన్న వంద రోజుల పనిదినాలను 150కు పెంచుతామని, న్యాయ్ పథకం తీసుకొచ్చి పేదలకు ప్రయోజనం చేకూరేలా చేస్తామని హామీ ఇచ్చారు