ప్లీజ్ నాకో ఛాన్సివ్వరూ… ప్రియమణి

0
106

తెలుగులో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన జగపతిబాబుకు సరైన జోడీ గుర్తింపు పొందిన హీరోయిన్ ప్రియమణి. ఈమె సినీ కెరీర్ పీక్ దశలో ఉన్నపుడే పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమైంది.

పైగా, అందం, నటన ఉన్నప్పటికీ సరైన అవకాశాలు లేకపోవడంతో తెరపై అంతగా రాణించలేకపోయింది. కారణాలు ఏమైనా ప్రియమణి దక్షిణాదిన మిగతా భాషలలో మంచి పేరే తెచ్చుకుంది. ఇదంతా ఒకప్పటి మాట.

పెళ్ళి తర్వాత టీవి షోలలో బిజీ అయిపోయింది. ఇప్పుడు ఓ తెలుగు సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతోందట. రానా దగ్గుబాటి, సాయిపల్లవి తదితరులు నటిస్తున్న ఈ సినిమా మీద ప్రియమణి బోలెడన్ని ఆశలు పెట్టుకుందట. ఈ సినిమా తనకు కలిసొచ్చి తెలుగులో మరిన్ని అవకాశాలు ఇప్పిస్తుందని అనుకుంటోదట.