అక్టోబరు 29న హీరో విశాల్ పెళ్లి

0
49
vishal - anisha
vishal - anisha

 

తమిళ హీరో, తమిళ నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె అనీషా రెడ్డితో విశాల్‌కు ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది. ఇక పెళ్లే జరగాల్సివుంది.

ఈ నేపథ్యంలో అక్టోబరు నెల 29వ తేదీన విశాల్-అనీషాలకు పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. అయితే వీరి వివాహం హైదరాబాద్‌లో జరుగుతుందా? చెన్నై‌లో నిర్వహిస్తారా? అనే విషయంలో క్లారిటీ లేదు. దీనిపై త్వరలోనే విశాల్ ఈ విషయంపై ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా, వరుస విజయాలతో దూసుకుపోతున్న విశాల్ మాస్ హీరోగా ప్రేక్ష‌కుల‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అటు తమిళం, ఇటు తెలుగులోనూ అభిమానుల‌ను క‌లిగి ఉన్న ప్ర‌స్తుతం ‘అయోగ్య’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.