అల్వార్ కామాంధులను ఉరి తీయాలి : మాయావతి

0
91
Mayawati
Mayawati

రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ అత్యాచార నిందితులను ఉరి తీయాలని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి డిమాండ్ చేశారు.

రాజస్థాన్‌లోని అల్వార్‌లో దళిత మహిళపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలో ఈఘటనపై మాయావతి స్పందించారు. దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను ఉరి తీయాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.

ఈ ఘటన దళిత మహిళకే సంబంధించిన అంశం కాదని, అన్ని వర్గాల మహిళలకు సంబంధించిన విషయమని ఆమె పేర్కొన్నారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కొందరు మహిళలను అవమానించేవిధంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను అవమానించే వారికి ఈ ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పాలని ఆమె కోరారు.