పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావొచ్చు : నాగబాబు

0
49

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ నటుడు నాగబాబు చెప్పుకొచ్చారు. ఆయన ఓ టీవీ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ అన్ని కులాలను కలుపుకుంటూ వెళుతున్నారని, తమకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కానీ, వైకాపా అధినేత జగన్‌తో కానీ ఎలాంటి శత్రుత్వం లేదన్నారు.

జగన్‌ను సీఎం కానివ్వను అని పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను గురించి మీడియా ప్రతినిధి నాగబాబును అడగగా.. అందుకు నాగబాబు పైవిధంగా స్పందించారు. కల్యాణ్ బాబు జగన్‌ను సీఎం కానివ్వడు, చంద్రబాబును కూడా సీఎం కానివ్వడని, పరిస్థితులు అనుకూలిస్తే పవన్ కల్యాణే సీఎం కావచ్చు అని చెప్పుకొచ్చారు.