తమిళ హీరో శరత్ కుమార్ పెద్ద కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె హీరోయిన్‌గా క్లిక్ కాలేకపోయింది. కానీ, నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో అద్భుతంగా రాణిస్తూ ప్రేక్షకుల మెప్పును పొందుతోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో అలాంటి పాత్రల్లో నటించి మెప్పించింది. తమిళ స్టార్ హీరో విజయ్ – ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం సర్కార్‌లో ఆమె అద్భుతంగా నటించింది. పైగా, జూనియర్ నమితగా పేరుగడించింది. గతంలో బాలయ్యబాబుతో హీరోయిన్ నమిత సింహా చిత్రంలో నటించిన విషయం తెల్సిందే.
ఇదిలావుంటే, నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఒక అప్‌డేట్ అందుతోంది. అదేంటంటే… బాలయ్యకు లేడీ విలన్‌గా వరలక్ష్మి నటించబోతోంది. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి.
మరోవైపు, ఈ చిత్రంలో జగపతిబాబు పవర్ ఫుల్ విలన్‌గా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ నిర్మించే ఈ చిత్రం ఈనెల 17వ తేదీన ప్రారంభంకానుంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతుంది.