కలువరేకుల్లాంటి కళ్ళతో మాయ చేస్తున్న రష్మిక

0
45

కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరోయిన రష్మిక మందన్నా. ఈమె నటించిన తొలి చిత్రం ‘ఛలో’. నాగశౌర్య హీరో. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కంట్లో పడింది.

ఈయన తెరకెక్కించిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రం కూడా సూపర్ హిట్. మంచి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో హీరోకు ఎంత పాత్రవుందో గీతగా చేసిన రష్మికకు అంతే మంచిపేరు వచ్చింది.

తన అభినయంతో ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే.. రష్మిక పెద్ద గ్లామర్ హీరోయిన్ కాదు. తన అభినయంతోనే ఆకట్టుకుంటోంది. అందమైన, నల్లని పెద్దవైన ఆమె కళ్ళు ప్రత్యేక ఆకర్షణ. ఆమె చిరునవ్వు ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. ఫలితంగా దర్శక నిర్మాతలు, హీరోలు సైతం ఆమె బుట్టలోపడిపోతున్నారు. ఒక స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికి అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి.