టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ పుట్టింది మే 9వతేదీ. ఆ సమయంలో పూర్తిగా వేసవి సెలవులు. ఎట్టిపరిస్థితుల్లోనూ బడులు తెరిచివుంచరు. విజయ్ చదివింది పుట్టపర్తిలో అయినప్పటికీ.. అక్కడ కూడా సెలవులిచ్చేస్తే ఇంటికి వచ్చేసి ఉంటాడు.
అలాంటపుడు మే నెలలో పుట్టిన ఎవ్వరూ కూడా స్కూల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకునే అవకాశం ఉండదు. కానీ విజయ్ దేవరకొండ ఇటీవల మాట్లాడుతూ, తాను చదువుకునే రోజుల్లో పుట్టిరోజు వేడుకలను పాఠశాలలో స్కూలు పిల్లలతో కలిసి చదువుకునేవాడినంటూ చెప్పుకొచ్చాడు.
దీన్ని నెటిజన్లు పట్టుకున్నారు. వేసవి సెలవుల్లో స్కూల్స్ ఎక్కడ తెరిచివుంటారంటూ ప్రశ్నించారు. అలా చూస్తే విజయ్ అబద్ధం చెబుతున్నట్లే. ఎలాంటి హీరో అయినా సరే.. అయినా ట్రోల్స్ వేయడానికి అవకాశం దొరికితే నెటిజన్లు ఊరుకోరు. దీని మీద మీమ్స్ తయారు చేసి విజయ్ మీద కామెడీ చేస్తున్నారు. ‘గీత గోవిందం’ కోసం ఒక పాట పాడి నెటిజన్లకు దొరికిపోయిన విజయ్.. మళ్లీ ఇప్పుడు ఇలా బుక్ అయ్యాడు.