బయోపిక్‌గా అబ్దుల్ కలాం జీవిత చరిత్ర

0
62

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల కాలం సాగుతోంది. బ‌యోపిక్ చిత్రాల‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో దర్శకనిర్మాతలు వివిధ రంగాల‌కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల బ‌యోపిక్స్ తెర‌కెక్కిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో మిసైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం బ‌యోపిక్ రూపొందించేందుకు బాలీవుడ్‌లో స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్టు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ క‌లాం బ‌యోపిక్‌ని త‌మ సంస్థ‌లో రూపొందించ‌బోతున్న‌ట్టు అధికారికంగా ప్రకటించారు.

రామ‌బ్ర‌హ్మం సుంక‌ర, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో అబ్దుల్ క‌లాం బ‌యోపిక్‌ని రూపొందించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాట‌. క‌లాం పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ అనీల్ క‌పూర్ న‌టించనున్నట్టు సమాచారం.

ఇటీవ‌ల అనీల్ క‌పూర్‌ని క‌లిసి స్క్రిప్ట్ వినిపించ‌గా, అది ఆయ‌న‌కు ఎంత‌గానో న‌చ్చ‌డంతో అబ్దుల్ క‌లాం బయోపిక్‌లో న‌టించేందుకు ఈ బాలీవుడ్ స్టార్ ఎంతో ఉత్సాహంగా ఉన్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

వ‌చ్చే యేడాది నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రం రాజ్ చెంగప్ప రాసిన రాసిన కలాం జీవిత చరిత్ర ఆధారంగా రూపొంద‌నుంది.