“మహానటి” కీర్తి సురేష్‌కు వరుస ఆఫర్లు

0
45

మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్. తెలుగులో ఆమె నటించిన చిత్రం మహానటి. ఈ ఒక్క చిత్రంతో ఆమె క్రేజ్ అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఆమె పాత్రల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటుంది. పైగా, ఆమెకు వరుస ఆఫర్లు వరిస్తున్నాయి. దీంతో ఆచితూచి అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలో రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో అలాగే హిందీలో ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా వుంది. అందులో భాగంగా ప్రస్తుతం తెలుగులో నరేంద్ర దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ‌. మరొకటి నగేష్ కుకునూరు దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తోంది.

వీటితోపాటు హిందీలో అజయ్ దేవగన్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇదిలావుంటే తాజాగా “సర్కార్” తర్వాత కోలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత మరో సినిమాకు కూడా ఆమె ఓకే చెప్పింది.

ఈ చిత్రానికి కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుంటే, “పేట” ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు నిర్మిస్తున్నారు. ఇది కూడా లేడీ ఓరియేంటేడ్ మూవీనే కావడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.