హీరో కోసం బరువు తగ్గి స్లిమ్‌గా మారిన అవికా గోర్

0
39

అవికా గోర్.. “ఉయ్యాలా జంపాలా” చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ. ఈమె తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. తొలి చిత్రంలోనే అద్భుతంగా నటించి సూపర్బ్ అనిపించుకుంది. అయితే, తన తొలి చిత్రంలోనే కాస్తబొద్దుగా కనిపించింది. ఆ తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించింది. అదేసమయంలో ఈ అమ్మడు విపరీతంగా బరువు పెరిగిపోయింది.

ఫలితంగా అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోయాయి. దీంతో తన బరువే తనకు శత్రువని ఈ అమ్మడు గ్రహించింది. తన సినీ కెరీర్‌ను నిలబెట్టుకునేందుకు కష్టపడి స్లిమ్‌గా మారిపోయింది. తిరిగి తన మొదటి సినిమా హీరో రాజ్‌ తరుణ్‌తోనే జత కట్టబోతోందట. తెర మీద వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుందనే టాక్ ఉందికూడా. ఇపుడు మళ్లీ వీరిద్దరే జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రారంభమయ్యే మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది.