అజిత్‌కు భారీ రెమ్యునరేషన్ రూ.60 కోట్లు?

0
71

తమిళ సూపర్ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. వరుసగా నాలుగు సూపర్ హిట్ చిత్రాలను అందించిన తమిళ హీరో.

అయితే, ఈయన తన తదుపరి చిత్రానికి తీసుకునే రెమ్యునరేషన్ విని కోలీవుడ్ ఇండస్ట్రీ నోరెళ్లబెడుతోంది. సాధారణంగా తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఉన్న రజినీకాంత్‌, కమల్‌హాసన్‌, విజయ్‌ వంటి హీరోలు రెమ్యూనరేషన్‌ అటుఇటుగా రూ.40 నుంచి రూ.50 కోట్ల వరకు వుండవచ్చని కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

అయితే, గత నాలుగు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన అజిత్‌ ఎంత రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నాడో తెలుసుకుందామని వారి అభిమానులు చాలా ఆసక్తిగా వున్నారు. “విశ్వాసం” చిత్రం తర్వాత బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ ‘నేర్‌కొండ పార్వై’ చిత్రానికి భారీ ఆఫర్‌ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అజిత్‌ తాను నటించనున్న కొత్త చిత్రానికి రూ.60 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం. ఇపుడు ఇదే కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.