అమ్మ చేతి కాఫీ గుడిలో ప్రసాదంతో సమానం: మహేశ్

0
50

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం మహర్షి. ఈ చిత్రం ఈనెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. దీంతో ఈ చిత్రం సక్సెస్ మీట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఇందులో హీరో మహేశ్ పాల్గొని మాట్లాడుతూ, ఈరోజు చాలా స్పెషల్ డే, ‘మదర్స్ డే’ అని, ‘నాకు అమ్మంటే దేవుడితో సమానం’ అని ప్రముఖ హీరో మహేశ్ బాబు అన్నారు.

తన సినిమా రిలీజ్‌కు ముందు తన తల్లి ఇచ్చే కాఫీ తాగుతానని, ఆ కాఫీ తాగితే గుడిలో ప్రసాదం తిన్నంత తృప్తిగా ఉంటుందని అన్నారు. ఆమె ఆశీస్సులు తనకు చాలా ముఖ్యమని, అందుకే తనకు విజయాలు లభిస్తున్నాయని అన్నారు. ఎంతో గొప్ప బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రాన్ని తల్లులందరికీ అంకితం చేస్తున్నట్టు మహేశ్ చెప్పారు.

అంతేకాకుండా, ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో తన తండ్రి అభిమానులు, తన అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరిగే చిత్రం ఇది అవుతుందని దర్శకుడు వంశీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తమ అభిమానులే కాదు, ‘ఈరోజున నేను కూడా కాలర్ ఎత్తాను.. వంశీ’ అంటూ ఈ చిత్రం విజయం సాధించడంపై మహేశ్ తన సంతోషం వ్యక్తం చేశారు. తన కెరీర్‌లో ఎంతో విజయవంతమైన చిత్రాలను ఈ చిత్రం అధిగమించబోతోందన్నారు.