వంశీ పైడిపల్లి బుగ్గకొరికిన ప్రిన్స్ మహేశ్ బాబు

0
67

ప్రిన్స్ మహేశ్ బాబు – డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం మహర్షి. ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంత చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. టాలీవుడ్ ప్రిన్స్, తనకు ఇంతటి హిట్‌ను ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి బుగ్గపై ముద్దివ్వగా, ఆ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

ఇక మహేశ్ తనకు ముద్దు పెడుతుండగా, సెల్ఫీ తీసుకున్న వంశీ, దీనికి “ఇదే నా జీవితంలో బెస్ట్‌ మూమెంట్‌. ఇంతకంటే ఇంకేం అడగగలను” అని క్యాప్షన్‌ పెట్టాడు. ఇక ఈ సినిమాలో చూపిన ‘వీకెండ్‌ వ్యవసాయం’ కాన్సెప్ట్‌ ఎంతో మందిని ఆ దిశగా నడిపిస్తుండగా, యువత, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వారాంతంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై, ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మిత్రులతో పంచుకుంటున్నారు.