కట్టుకున్న భార్యను పోషించలేక వదిలేసిన మోడీ : మాయావతి

0
39
Mayawati
Mayawati

ప్రధాని నరేంద్ర మోడీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కట్టుకున్న భార్యనే వదిలేయడం అత్యంత సిగ్గుచేటైన విషయమన్నారు. భార్యను వదిలేసిన నరేంద్ర మోడీకి ఇతరుల భార్యలు, సోదరీల పట్ల గౌరవం ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని ఆళ్వార్‌లో సంచలనం రేపిన అత్యాచార ఘటనపై మాయావతి మొసలి కన్నీరు కారుస్తున్నారని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ, మోడీవి చిల్లర రాజకీయాలన్నారు.

నీచ రాజకీయాలు చేస్తూ, బీజేపీకి మేలు చేకూర్చడమే ఆయన ఉద్దేశమని మండిపడ్డారు. తమ భర్తలు ప్రధానిని కలుస్తున్నారంటే, బీజేపీ నేతల భార్యలు భయంతో వణుకుతున్నారని, మోడీలాగే తన భర్త తనను వదిలేస్తారన్న భయం వారిలో ఉందన్నారు.

ఆ పార్టీలో వివాహితులైన నేతల భార్యలు తమ భర్తలను మోడీతో చూసి ఆందోళన చెందుతున్నారని అన్నారు. కాగా, దేశంలో సార్వత్రిక సమరం తుది దశకు చేరిన నేపథ్యంలో నేతల మధ్య మాటల తూటాలు కూడా హద్దులు దాటుతున్నాయి.