ఫోర్జరీ కేసులో రవి ప్రకాష్ అరెస్టుకు రంగం సిద్ధం..

0
49

సంతకాల ఫోర్జరీ కేసులో టీవీ9 సీఈవో రవి ప్రకాష్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. గత రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

సంతకాల ఫోర్జరీ, నిధుల దారిమళ్లింపు కేసుల్లో రవి ప్రకాష్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే ఆయనకు రెండుసార్లు నోటీసులు జారీచేశారు. ఆదివారం తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ రాకపోవడంతో పోలీసులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

‘161 సీఆర్‌పీసీ ప్రకారం సాక్షుల నుంచి మాత్రమే వివరాలు సేకరిస్తాం. ఫిర్యాదుదారు పేర్కొన్న ఆరోపణల్లో వాస్తవముంటే.. అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేస్తాం. ఈ సెక్షన్‌ ప్రకారం కోర్టు నుంచి ఎలాంటి వారెంట్‌ అవసరం లేకుండానే అరెస్ట్‌ చేయొచ్చు. కేసులో టీవీ9 మాజీ డైరెక్టర్‌ ఎంవీవీఎన్‌ మూర్తిని ఆదివారం కూడా ప్రశ్నించాం.

ఆయన నుంచి కీలక ఆధారాలను సేకరించాం. అందులో భాగంగానే రవిప్రకాశ్‌, సినీ నటుడు శివాజీకి సీఆర్‌పీసీ 41ఏ కింద త్వరలో నోటీసులు జారీ చేస్తాం. మరుసటి రోజే విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తాం. ఒకవేళ పోలీసుల ఎదుట హాజరుకాకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.