చాలా మందికి భోజనానికి ముందు నీరు తాగే అలవాటు ఉంటుంది. ఇంకొందరికి ప్రతి ముద్దముద్దకూ నీరుతాగుతారు. అయితే, కొందరు భోజనం తిన్నాక ఎంత సేపటికి నీటిని తాగాలి? అని ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలోనే అసలు ఆహారం తీసుకున్నాక ఎంత సేపటికి నీటిని తాగితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..!
సాధారణంగా శరీరానికి నీరు అత్యంత ఆవశ్యకం. మనం ప్రతి రోజూ నీటిని తప్పనిసరిగా తాగాలి. నీటిని తాగడం వల్ల మన శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరుగుతాయి. అలాగే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.
అయితే, భోజనానికి ముందు అర్థగంట, ఆరగించాక 30 నిమిషాల తర్వాత మాత్రమే నీటిని తాగాలని ఆయుర్వేదం చెబుతోంది. అలా అయితేనే మన జీర్ణాశయంలో జీర్ణ రసాలు సరిగ్గా ఉత్పత్తి అయి మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తాయట.
కానీ ప్రస్తుత తరుణంలో చాలా మంది ఈ విధానాన్ని పాటించడం లేదు. అయితే ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తే.. చాలావరకు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.