కమల్‌వి విభజన రాజకీయాలు : బీజేపీ

0
84

స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువేనని వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరామ్‌ గాడ్సేను తొలి తీవ్రవాదిగా అభివర్ణించారు. కమల్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది.

ఈ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ స్పందిస్తూ, గాంధీజీ హత్యకు గురైనప్పుడు దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనైందని, ప్రతిఒక్కరూ బాధపడ్డారన్నారు. గాడ్సే చేసిన క్రూరమైన చర్యకు అప్పడే తగిన శిక్ష పడిందన్నారు.

ఇప్పుడు కమల్‌హాసన్ ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతానికి వెళ్లి హిందూ తీవ్రవాదం అంటూ ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో నూతన ఒరవడి తీసుకొస్తానని చెప్పిన ఆయన.. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

‘విశ్వరూపం’ విడుదలకు అడ్డంకులు ఎదురైనప్పుడు దేశం వదిలి వెళ్లిపోతానని అన్నారని, ఇప్పుడు దేశం, దేశభక్తి, గాంధీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. కమల్‌హాసన్ ఐదురోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించాలంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదుచేసింది. ఆయన మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ ఈసీకి లేఖ రాశారు.