హీరో మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం మహర్షి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దీంతో చిత్ర యూనిట్ ఇటీవల పార్టీ చేసుకుంది. ఈ పార్టీకి హాజరైన వారంతా ఫుల్లుగా మద్యం సేవించారు. వీరిలో పూజా హెగ్డే కూడా ఉన్నారు.
పూజా హెగ్డే మందు తాగి పోలీసులకు దొరికిపోయిందన్న న్యూస్ అంతర్జాలంలో హల్‌చల్ చేసింది. దీనిపై ఆమె మేనేజరు వివరణ ఇచ్చారు. “మహర్షి” సినిమా హిట్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన యూనిట్ పార్టీ చేసుకుంది. పార్టీ చేసుకున్న మాట నిజమేనని మేనేజర్ స్పష్టం చేశాడు.
పూజా హెగ్డేకు విమానం ఆలస్యమవుతుందని కారణంతో ఓ కారులో డ్రైవర్‌ను ఇచ్చి పంపించామని వెల్లడించారు. కారును పూజా హెగ్డే డ్రైవ్ చేయలేదని డ్రైవరే నడుపుతున్నాడని వివరణ ఇచ్చాడు.
పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టినప్పుడు పూజా హెగ్డే కారులో ఉన్నారని పేర్కొన్నారు. పార్టీకి వచ్చిన వారు మద్యం మత్తులో ఉండడటంతో ప్రతి ఒక్కరికి కార్లను ఏర్పాటు చేశామని సినిమా యూనిట్ కూడా వివరణ ఇచ్చింది.