పశ్చిమ బెంగాల్‌లోని కానింగ్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. బెంగాల్‌లో ర్యాలీలు నిర్వహించకుండా తనను అడ్డుకోగలరేమో కానీ రాష్ట్రంలో బీజేపీ విజయాన్ని మాత్రం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అడ్డుకోలేరన్నారు.
అంతకుముందు అమిత్ షా జాధవ్‌పూర్‌లో నిర్వహించతలపెట్టిన ర్యాలీకి బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంపన్న రాష్ట్రమైన బెంగాల్‌ను మమతా బెనర్జీ పేద రాష్ట్రంగా మార్చారని, తాము అధికారంలోకి వస్తే బెంగాల్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.
మమతా బెనర్జీ ఆలోచనంతా చొరబాటుదారులను ఎలా రక్షించాలి.. వారి ఓటు బ్యాంకును ఎలా కాపాడుకోవాలన్నదానిపైనే ఉంటుందని అమిత్ షా విమర్శించారు. కాగా, వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య తీవ్రవైరం నెలకొనివున్న విషయం తెల్సిందే.