ప్రతి రోజూ ఇలా చేయండి…

0
77

చాలా మంది నిద్రలేవగానే బెడ్ కాఫీ కావాలని మారాం చేస్తుంటారు. నిద్రలేచి టీ లేదా కాఫీ తాగిన తర్వాతే పడకపై నుంచి కాలు కిందపెడతారు. నిజానికి నిద్రలేవగానే కేవలం 2 నిమిషాలు సూర్యుని లేత కిరణాలు శరీరంపై పడేలా చేస్తే చాలు.. రోజంతా ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటారు.

నిజానికి వ్యాయామం ముందు వార్మప్ చేసినట్లు ఉదయం లేవగానే ఏదో ఒక పనిలో పడిపోకుండా ఒక నిమిషం రిలాక్స్‌గా తాజా గాలిని ఆస్వాదించి ఈ రోజు చేయవల్సిన పనుల గురించి ఆలోచిస్తూ కూర్చోమంటున్నారు నిపుణులు.

ఉదయం నిద్రలేవగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు కలుసుకోవాల్సిన వ్యక్తులు, పనులు వరుసగా పెట్టుకుని సాయంత్రం వరకు ఎంత బిజీగా గడుపుతారో లెక్కవేసుకోవచ్చు.

తర్వాత మనసుకు నచ్చిన పాట వింటూనో, పదినిమిషాలు ఆరుబయట పచ్చికలోను అపార్ట్ మెంట్‌లోనో ఉంటే సెల్లార్‌లో నిలబడి సూర్యుని లేత కిరణాల వెచ్చదనాన్ని ఆస్వాదించాలి.

అటు తర్వాత కప్పు కాఫీ తాగేసి, పనుల్లో చొరబడిపోవచ్చు. అంతేకానీ లేవగానే మొదలయ్యే మొదటి ఐదు నిమిషాలు మాత్రం మన గురించి మనం ఆలోచించుకోవాలంటున్నారు.