మే 14, 2019 మంగళవారం మీ రాశిఫలితాలు

0
94

మేషం : వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందు లెదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆత్మీయులు, బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. మీ గౌరవ ప్రతిష్టకు భంగం కలుగకుండా వ్యవహరించండి. దూరప్రయాణాలు అనుకూలం.

వృషభం : నిరుద్యోగులకు ప్రకటనల పట్ల ఏకాగ్రత అవసరం. స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు ఊహించినవే కావటంతో పెద్దగా ఇబ్బందులుండవు. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు నష్టాల బాటలో సాగుతాయి. రవాణా రంగాలలోని వారికి ఏకాగ్రత అవసరం.

మిథునం : ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాల్లో చికాకులు, పనిభారం, అధికారుల నుంచి ఒత్తిడి వంటి చికాకులు తప్పవు. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రిప్రజెంటివ్‌లకు నెమ్మదిగా మార్పులు కానవస్తాయి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు.

కర్కాటకం : సిమెంటు, ఐరన్, కలప రంగాలలో వారికి వారి రంగాలలో చురుకుదనం కానవస్తుంది. శత్రువులు మిత్రులుగా మారిమీకు సహాయాన్ని అందిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు ఇతరుల జోక్యం వలన వాయిదా పడతాయి. ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.

సింహం : ఒక శుభకార్యం నిశ్చయం కావటంతో కల్యాణ మంటపాల కోసం అన్వేషిస్తారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. దైవదీక్షలు స్వీకరిస్తారు. పొగాకు, ప్రత్తి రంగాలలో వారికి కలిసి వచ్చే కాలం. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.

కన్య : లౌకికంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. విదేశీ వస్తువులపై ఆసక్తి పెరుగుతుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.

తుల : మిత్రుల కలయికతో నూతన ఉత్సాహం లభిస్తుంది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒక వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు. స్త్రీలు ఉపవాసాలు, శ్రమాధిక్యత కారణంగా స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఖర్చులు అధికం.

వృశ్చికం : బంధువుల కోసం ధనం ఖర్చుచేస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. నూతన దంపతులకు సంతాన ప్రాప్తి.

ధనస్సు : కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. స్త్రీలకు ప్రతి విషయంలోను తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. వృతిపరంగా ఎదురైన సమస్యలను అధికమిస్తారు. ప్రేమికులకు సన్నిహితులు అండగానిలుస్తారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలో విజయాన్ని సాధిస్తారు.

మకరం : ఉద్యోగస్తులకు విధినిర్వహణలో తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం విరమించుకోవటం శ్రేయస్కరం. నూతన వస్తువులను కొనుగోలుచేస్తారు.

కుంభం : ఆర్థిక విషయాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తారు. ప్రింటింగ్ రంగాల్లోవారికి అచ్చుతప్పులు పడటంవల్ల మాటపడతారు. మీ కష్టం ఫలించటంతో అనిర్వచనీయమైన ఆనందం పొందుతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. దైవకార్యాల పట్ల ఆసక్తి నెలకొంటుంది.

మీనం : మీ జీవిత భాగస్వామి ప్రోద్వలంతో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. మీ అవసరాలు, బలహీనతలను ఇతరులు స్వార్థానికి వాడుకుంటారు. వృత్తుల వారికి సంఘంలో మంచి గుర్తింపు, తగిన ప్రతిఫలం లభిస్తాయి. బ్యాంకు పనులు వాయిదాపడతాయి.