పూరీ చేతికి చిక్కిన నిధి అగర్వాల్… మరో ఛార్మికానుందా?

0
46

దర్శకుడు పూరీ జగన్నాథ్ దృష్టిలో పడ్డానని, ఇకపై తనకు అన్ని రకాల అనుభవాలు వస్తాయని కుర్ర హీరోయిన్ నిధి అగర్వాల్ అంటోంది.

అక్కినేని ఇద్దరు హీరోలతో వరుసగా జతకట్టి రికార్డు సొంతం చేసుకోగలిగినా, సినిమాల సక్సెస్‌ల విషయంలో వెనుకపడే ఉంది. తెలుగులో నిధి నటించిన రెండు సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా, ఆ సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

దాంతో పూరీ దృష్టిలో పడింది. పూరీ కొత్త సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో ఛాన్స్‌ దక్కించుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో నిఖార్సయిన విజయం సొంతం చేసుకుంటానని గట్టిగా నమ్మకం వ్యక్తం చేస్తోంది.

అలాగే, తెలుగులో ఇప్పటి వరకూ నేను చేసింది రెండే సినిమాలు కనుక ఇలాంటి పాత్రలే చేయాలన్న నిబంధనలేవీ పెట్టుకోలేదు. నా దగ్గరకు వచ్చిన సినిమాల్లో మంచి సినిమాలు చేస్తున్నాను. ‘ఇస్మార్ట్ శంకర్’ కాస్త విభిన్నమైన రోల్స్‌పై దృష్టిసారిస్తానని చెప్పుకొచ్చింది.