స్వతంత్ర భారతావనిలో తొలి తీవ్రవాది హిందువేనంటూ విశ్వనటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను జీర్ణించుకోలేని కొందరు హిందువులు ఆయనపై కేసులు పెడుతున్నారు.
తాజాగా కమల్ హాసన్‌పై ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కోర్టులో విష్ణు గుప్తా అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సే స్వతంత్ర భారతావనిలో తొలి హిందూ ఉగ్రవాది అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, కాబట్టి కమల్‌పై చర్య తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
పైగా, కమల్‌పై ఐపీసీ సెక్షన్ 153-ఏ, సెక్షన్ 295-ఏ పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌దారు కోరారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది. మరోవైపు ఇదే అంశంపై బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ కూడా నేడు ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టును ఆశ్రయించారు. అలాగే, తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా కోర్టులో కూడా ఓ కేసు దాఖలైంది.