అప్పటి నుంచి కాజల్ నా వెంటే తిరుగుతోంది…

0
57

విలక్షణ దర్శకుడు తేజ కొత్త చిత్రం “సీత”. ఇందులో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రను పోషించగా, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించింది. ఈ నెల 24వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో డైరెక్టర్ తేజ బిజీగా వున్నాడు.

తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఈ కథను సిద్ధం చేసుకున్న తర్వాత సరదాగా ఒకసారి కాజల్ అగర్వాల్‌కి ఆఫీసుకు పిలిపించి కథ వినిపించాను. అంతే.. అప్పటి నుంచి ఈ పాత్రను తనే చేస్తానంటూ పట్టుబట్టింది. అప్పటి నుంచి ఆమె నాతోనే కలిసి ప్రయాణం చేస్తోంది.

పైగా, ఈ చిత్రం తనతోనే చేయాలని పట్టుబట్టింది. దాంతో ఏ హీరోకి కథ చెప్పినా.. ప్రధాన పాత్రధారి కాజల్ అనే చెబుతూ వచ్చాను. ఇది కథానాయిక చుట్టూ తిరిగే కథ కావడం వలన, కాజల్ వంటి సీనియర్ హీరోయిన్ జోడీ కట్టడానికిగాను కొంతమంది యువ హీరోలు వెనకడుగు వేశారు.

బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం.. కథ వినగానే తాను చేస్తానని చెప్పాడు. ఈ కథపై కాజల్ పెట్టుకున్న నమ్మకం నిజమవుతుందనీ, ఆమె కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలుస్తుందని అన్నారు. కాగా, ఈ చిత్రంలో “ఆర్ఎక్స్ 100” భామ పాయల్ రాజ్‌పుత్ ఐటమ్ సాంగ్‌లో రెచ్చిపోయింది.