ఆ కారణంగానే సినీ ఛాన్సులు తగ్గించా : అనుష్క శర్మ

0
45
anushka sharma
anushka sharma

బాలీవుడ్ నటి, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయలేదు. ఈమె నటించిన చిత్రం జీరో. ఈ చిత్రం గత యేడాది విడుదలైంది. ఆ తర్వాత అనుష్క ఒక్క కొత్త ప్రాజెక్టుకూ సైన్ చేయలేదు.

దీనిపై ఆమె స్పందిస్తూ, తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని… వాటికి సమయాన్ని కేటాయించడం కోసమే కొత్త సినిమాకు సైన్ చేయలేదని వివరణ ఇచ్చింది. సినీ నటిగా 2018లో ‘పారి’, ‘సూయీ ధాగా’, ‘జీరో’ సినిమాలు చేశానని… ఈ మూడు చిత్రాలు విభిన్నమైనవని తెలిపింది.

విభిన్నమైన చిత్రాలను చేయాలంటే ఎంతో ప్రిపరేషన్ అవసరమని చెప్పింది. అందువల్ల వచ్చిన ఆఫర్లన్నింటినీ తీసుకోలేమని చెప్పింది. ఓవైపు నటిగా ఉంటూనే నిర్మాతగా వ్యవహరిస్తున్నానని… ప్రస్తుతం ఒక సినిమాతో పాటు, స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కోసం షోలను నిర్మిస్తున్నానని అనుష్క తెలిపింది. వీటికి కూడా సమయాన్ని కేటాయించాల్సి ఉందని చెప్పుకొచ్చింది.