టాలీవుడ్ హీరో మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం మహర్షి. ఈ నెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కాసుల వర్షం కురిపిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్ నటించగా, అల్లరి నరేశ్ కీలకమైన పాత్రలో కనిపించాడు.
అయితే, ఈ చిత్రం విడుదలైన ప్రతిచోటా ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. అదీ కూడా కేవలం నాలుగు రోజుల్లోనే. ఈ చిత్రం కలెక్షన్ల సునామీకి టాలీవుడ్ ప్రముఖులు విస్మయాన్ని వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకి మరి కొన్ని సీన్స్‌ను జోడించే ఆలోచనలో టీమ్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మహేశ్ బాబుకి నచ్చిన సీన్స్ కొన్ని ఉన్నాయట. అయితే నిడివి ఎక్కువగా ఉందని ఆ సీన్స్‌ను ట్రిమ్ చేశారట.
ఇప్పుడు ఆ సీన్స్‌ను పూర్తిగా ఉంచాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. వీటిలో కామెడీకి సంబంధించిన ఒకటి.. రెండు సీన్స్ కూడా జోడించనున్నారు. రెండో వారంలో కొత్త సీన్స్ జోడింపు ఉంటుందని చెబుతున్నారు. ఈ కారణంగా 10 నిమిషాల నిడివి పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.