ముదురు హీరోలను ఇష్టపడుతున్న రష్మిక

0
81

కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భామల్లో రష్మికా మందన్నా ఒకరు. ఈమె “ఛలో” చిత్రంలో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ.. “గీత గోవిందం” తర్వాత ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత దేవదాస్ చిత్రంలో నటించినప్పటికీ అది క్లిక్ కాలేదు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తాజా చిత్రం “డియర్ కామ్రేడ్” చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో లిప్‌లాక్‌ సీన్లలో రెచ్చిపోయింది.

అయితే, ఈమె కుర్ర హీరోలతో కలిసి పనిచేసేందుకు సమ్మతించడం లేదు. కేవలం పెద్ద హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తానని చెబుతోందట. చిన్న హీరోలతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు.. రష్మికను కలిసేందుకు వెళ్తే మొహం చాటేస్తోందట. పైగా, ఆమె డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఒకే అంటున్నా వాళ్లకు నో చెబుతోందట.

కెరీర్ ప్రారంభంలో చిన్న హీరోలతో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మళ్లీ అటువైపు ఎందుకులే అని అనుకుంటున్నారట. అంతేకాదు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తే చాలా కాలంపాటు స్టార్‌గా ఇండస్ట్రీలో ఉండొచ్చని ఆమె భావిస్తున్నారట.

కాగా, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటిస్తున్న రష్మిక.. ఈ చిత్రం తర్వాత మహేశ్ బాబుతోనూ, ఆ తర్వాత అల్లు అరవింద్ నిర్మించే చిత్రంలోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటు.. తమిళం, కన్నడ చిత్రాల్లో నటించనుంది.