ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బహిరంగ సవాల్ విసిరారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీతో స్నేహం కోసం డీఎంకే తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టిందంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై స్టాలిన్ ఘాటుగా స్పందించారు.
ఆమె చేసిన ఈ ఆరోపణలను రుజువు చేస్తే కనుక, రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. ఈ ఆరోపణలు తప్పని తేలితే ఆమెతో పాటు ప్రధాని మోడీ కూడా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు.
కాగా, రెండు రోజుల క్రితం తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నైకు వచ్చిన స్టాలిన్‌ను కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఆ తర్వాత తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు తమిళనాట ప్రకంపనలు రేపుతున్నాయి.